అగిన పీర్జాదిగూడ అవిశ్వాసం.. క్రిమినల్ కేసే అడ్డంకా..?

పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పై ఆయన వర్గమే పెట్టిన అవిశ్వాస తీర్మానం ఆగింది. పూర్తి వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డిపై ఆయన వర్గీయులు బుధవారం నాడు పెట్టిన అవిశ్వాస తీర్మానం నిలిచిపోయింది.

అగిన పీర్జాదిగూడ అవిశ్వాసం.. క్రిమినల్ కేసే అడ్డంకా..?

మేడిపల్లి, (మన సాక్షి):

పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పై ఆయన వర్గమే పెట్టిన అవిశ్వాస తీర్మానం ఆగింది. పూర్తి వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డిపై ఆయన వర్గీయులు బుధవారం నాడు పెట్టిన అవిశ్వాస తీర్మానం నిలిచిపోయింది.

అవిశ్వాసానికి క్రిమినల్ కేసే అడ్డంకా?.

పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పై ఆయన వర్గీయులు బుధవారం నాడు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కా‌నీ అనూహ్యంగా మేయర్ పై కార్పొరేటర్లు పెట్టిన చీటింగ్ కేసు నమోదు కావడంతో సీరియస్ గా తీసుకున్న న్యాయస్థానం కేసు పుర్వపరాలు తెలిసే వరకు అవిశ్వాసం పట్టోద్దని న్యాయ స్థానం సూచించింది.

అసలేం జరిగింది….

పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గాను 14 మంది కార్పొరేటర్లు 06 మే రోజున మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు నోటిస్ అందించారు. అయితే రెండు రోజుల అనంతరం కార్పొరేషన్ అభివృద్ధి కోసం సంతకాలు తీసుకుని అవిశ్వాస తీర్మానానికి వాడుకున్నారని ఆరోపిస్తూ మే 7 న నాలుగురు కార్పొఅయ్యాయి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు వ్రాతపూర్వకంగా లేఖ అందచేశారు. కానీ కలెక్టర్ సదరు లేఖను పరిగణలోకి తీసుకోలేదు

దీంతో కార్పొరేటర్లు న్యాయ స్థానాన్ని ఆశ్రయించి కలెక్టర్ కు సదరు సంతాకలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.అదే సమయంలో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని కార్పొరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేయర్ జక్క వెంకట్ రెడ్డిపై ఐపీసీ 420 కేసు నమోదు చేశారు.కేసు నమోదు మేరకు సదరు కేసు పూర్వపారాలు తేలే వరకు ఏలాంటి అవిశ్వాసం పెట్టవద్దని మేడ్చల్ కలెక్టర్ నుండి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి అందుకే బుధవారం నాడు జరగాల్సిన అవిశ్వాసం నిలిచిపోయింది.

మేయర్ అక్రమాలపై విచారణ జరపాలి..
ఆమర్ సింగ్, కార్పొరేటర్.

పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని కార్పొరేటర్ ఆమర్ సింగ్ అన్నారు. కేవలం తన అక్రమాలు ఎక్కడ బయటకు వస్తాయానే ఆందోళనరో మేయర్ అనేక అక్రమ పద్దతులకు పాల్పడుతున్నరని అందులో భాగంగానే కార్పొరేటర్ల‌ను నాయనో భయానో మచ్చిక చేసుకుని టూర్ ల పేరితొఇ కాలయాపన చేస్తున్నారని మేయర్ గా జక్క వెంకట్ రెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకుని చేసిన అక్రమాలపై త్వరలోనే విచారణ జరుగుతుందనే అశభావం వ్యక్తం చేశారు.


నిబంధనలకు విరుద్దంగా అవిశ్వాసం ఆపేశారు…

మేయర్ జక్క వెంకట్ రెడ్డి.

సభ్యులందరూ తమ అభీష్టం మేరకే అవిశ్వాసం తీర్మానం నోటిస్ పై సంతకాలు చేశారని కానీ కావాలనే కొందరు సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి తనపై తప్పుడు సంతకాలు చేశారని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. కలెక్టర్ తనకు లేని అధికారాలను ఉపయోగించి అవిశ్వాస తీర్మానం లేకుండా చేశారని.

అదే సమయంలో తప్పుడు కేసులు నమోదు చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చెయ్యాలని చూస్తున్నారని వాపోయారు.పీర్జాదిగూడ లో జరుగుతున్న అన్ని రకాల పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే మాకు న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నామని అన్నారు.