Suryapet : సూర్యాపేట పోలీసులు సంచలన నిర్ణయం.. గంజాయి వినియోగిస్తున్న వారికి పరీక్షలు, కౌన్సిలింగ్..!
గంజాయి రవాణా, సరఫరా కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి, వినిపిస్తున్న వారికి తల్లిదండ్రుల సమక్షం లో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు కౌన్సిలింగ్ నిర్వహించారు.

Suryapet : సూర్యాపేట పోలీసులు సంచలన నిర్ణయం.. గంజాయి వినియోగిస్తున్న వారికి పరీక్షలు, కౌన్సిలింగ్..!
సూర్యాపేట, మనసాక్షి:
గంజాయి రవాణా, సరఫరా కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి, వినిపిస్తున్న వారికి తల్లిదండ్రుల సమక్షం లో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు కౌన్సిలింగ్ నిర్వహించారు.. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నర్సింహా హాజరై నిందితులను ఉద్దేశించి మాట్లాడుతూ గంజాయి వినియోగం వల్ల జరుగుతున్న అనర్ధాల గురించి అవగాహన కల్పించారు.
గంజాయి వినియోగిస్తున్న వారికి పోలీస్ స్టేషన్ నందు డాక్టర్ల సహాయంతో మూత్ర పరీక్షలు చేయడం జరిగింది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాలల రక్షణ డ్రగ్స్ నిర్మూలనపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే గంజాయి రవాణా వినియోగం కేసుల్లో ఉన్న వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని డాక్టర్ల సహాయంతో మూత్ర పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు.
డ్రగ్స్ గంజాయి వినియోగించడం వల్ల మత్తులో ఆలోచన విధానం కోల్పోయి నేరాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, అనారోగ్యం బారిన పడుతూ భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. ఈ గంజాయిని మన సమాజం నుండి లేకుండా చేయాలని మన పిల్లలను మన సమాజాన్ని ఈ గంజాయి మత్తు నుండి కాపాడుకోవాలని తెలిపారు.
గంజాయి వినియోగించిన సరఫరా చేసిన అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి సంబంధ కేసుల్లో ఉన్న వ్యక్తులపై పోలీస్ శాఖ పటిష్టంగా నిఘా ఉంచిందని, కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అన్నారు. ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం వీరుపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
డ్రగ్స్ గంజాయి వినియోగం, రవాణా కేసుల్లో చిక్కుకుంటే గరిష్టంగా 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష జరిమానా పడుతుందని తెలిపారు, ఇలాంటి వారిపై పోలీస్ స్టేషన్ల నందు హిస్టరీ సీట్స్ నమోదు చేస్తామని ఐదు లక్షల వరకు బైండోవర్ చేస్తామని పిడి ఆక్ట్ నమోదు చేసి రెండు సంవత్సరాలు జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు.
మార్పు రావాలని గంజాయి సంబంధించిన సమాచారాన్ని పోలీసువారికి అందించాలని ఈ సందర్భంగా కోరారు. దీనికి అలవాటు పడి వారిలో మార్పు తేవడానికి పునరావాసం, సత్ప్రవర్తన డి అడిక్షన్ కేంద్రాలకు పంపడం జరుగుతుందని అన్నారు. డ్రగ్స్ గంజా లాంటి వాటిని ఇకముందు వినియోగించాలని, రవాణా చేయమని, నిర్మూలనలో భాగస్వామ్యం అవుతామని, సత్ప్రవర్తనతో ఉంటానని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పట్టణ ఎస్ఐలు ఏడుకొండలు, శివతేజ, మహేందర్ నాథ్, సాయిరాం, వెంకన్న, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఎస్సైలు శ్రీకాంత్ గోపికృష్ణ పోలీసు సిబ్బంది ఉన్నారు.










