హైదరాబాద్ : 791 టన్నుల స్టీల్, 96 టన్నుల ఇత్తడి తో అంబేడ్కర్ విగ్రహం, 14న ఆవిష్కరణ
హైదరాబాద్ : 791 టన్నుల స్టీల్, 96 టన్నుల ఇత్తడి తో అంబేడ్కర్ విగ్రహం, 14న ఆవిష్కరణ
అంబేడ్కర్ విగ్రహ పనులను పరిశీలించిన మంత్రుల బృందం
హైదరాబాద్, మన సాక్షి:
హైదరాబాద్ నగరంలో అత్యంత ఎత్తులో నిర్మిస్తున్న 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహన్ని రాష్ట్ర ఎస్సి అభివృద్ధి సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం శుక్రవారం నాడు పరిశీలించారు. ఏప్రిల్ 14 న అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు.
విగ్రహం పనులను పరిశీలించిన మంత్రుల బృందంలో కే టి ఆర్, హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలి, తలసాని శ్రీనివాస్,ఎర్రబెల్లి దయాకర్ రావు,మల్లారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. మరో వారం రోజుల్లో నిర్మాణ పనులన్నీ పూర్తి చేసే లక్ష్యంతో సిబ్బంది పనిచేస్తున్నాని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.
సీ ఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విగ్రహం నిర్మాణం పనులు పరిశీలించడం జరిగిందని చెప్పారు. ప్రధాన విగ్రహంతో పాటు అక్కడ నిర్మిస్తున్న రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటెన్, సాండ్ స్టోన్ వర్క్స్, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకొనే మెట్లదారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్స్ సీలింగ్ తదితర పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు, వర్క్ ఏజెన్సీతో సమావేశమై పనుల పురోగతిపై చర్చించారు. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా తెలంగాణకే మణిహారంగా నిలుస్తుందని నిలుస్తుందని మంత్రి చెప్పారు.
విగ్రహం నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.
అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.












