నల్గొండ, గద్వాల, వరంగల్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన..!

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలోని ఎన్నికల ప్రచార సభలలో ఆయన పాల్గొంటారు. అనంతరం భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

నల్గొండ, గద్వాల, వరంగల్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన..!

హైదరాబాద్ , మన సాక్షి :
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలోని ఎన్నికల ప్రచార సభలలో ఆయన పాల్గొంటారు. అనంతరం భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం కు చేరుకోనున్న అమిత్ షా అనంతరం 1. 35 గంటలకు గద్వాల సభలో పాల్గొని మాట్లాడుతారు. అనంతరం 3. 35 గంటలకు నల్గొండ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

నల్గొండ బహిరంగ సభ నుంచి నేరుగా వరంగల్ సభలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేయనున్నారు.