Crime News : మేనకోడల్ని బురద నీటిలో ముంచి చంపిన మేనమామ..!

మతిస్థిమితం లేని వ్యక్తి తన మేనకోడల్ని బురద నీళ్లలో ముంచి చంపిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

Crime News : మేనకోడల్ని బురద నీటిలో ముంచి చంపిన మేనమామ..!

దుబ్బాక, మనసాక్షి :

మతిస్థిమితం లేని వ్యక్తి తన మేనకోడల్ని బురద నీళ్లలో ముంచి చంపిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

మందపల్లి గ్రామానికి చెందిన పిట్టలు పట్టే కులస్తులు మామిడి తోటలు పట్టుకునేందుకు గత కొన్ని రోజుల క్రితం బద్దిపెడుగ గ్రామానికి వచ్చి వేముల శ్రీధర్ రెడ్డి కి చెందిన మామిడి తోటలో నివాసం ఉంటున్నారు. అదే మామిడి తోటను మామిడి పండ్ల కోసం లీజుకు తీస్తున్నారు. బాలిక ఆడుకుంటుండగా మేనమామ శ్రీను నాటు వేసిన మడిలో నీ బురద నీటిలో ముంచడంతో ఊపిరాడక గుజరాతి రాజు సంతోష కూతురైన శిరీష 4 మృతి చెందింది.

దీంతో గ్రామస్తులు అతనిని చితకబాది చేతులు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. కాలయ శ్రీనుకు సరిగా మతిస్థిమితం లేదని గ్రామస్తులు తెలిపారు. అక్కడికి చేరుకున్న రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ ఎస్సై భాస్కర్ రెడ్డి అతని అదుపులోకి తీసుకున్నారు.

 

తెలుగులో బ్రేకింగ్ న్యూస్ మన సాక్షిలో చదవండి. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలతో పాటు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ చదవండి.