Anganwadi : 15 రోజులకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె..!

Anganwadi : 15 రోజులకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె..!

అంగన్వాడీలకు న్యాయం చేయాలి…జులకంటి

మిర్యాలగూడలో బోనాలతో నిరసన, మానవహారం

సమ్మెకు మాజీ ఎమ్మెల్యే రేపాల మద్దతు..!

15 రోజులకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మంగళవారం 15 రోజులకు చేరుకుంది సమ్మెలో భాగంగా మంగళవారం మిర్యాలగూడలో అంగన్వాడీలు బోనాలతో నిరసన తెలిపారు స్థానిక రాజీవ్ చౌక్ వద్ద మానవహారం చేశారు. సమ్మెకు మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ఈ సమ్మెలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు.

ALSO READ : TS TET : టెట్ ఫలితాలకు అంతా సిద్ధం.. ఫలితాలు ఎప్పుడంటే..!

అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం సంఘాలతో చర్చలు జరిపి వారి హక్కులను నెరవేర్చాలన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఇతర సౌకర్యాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

15 రోజులుగా అంగన్వాడీల సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. దశలవారీగా ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. అంగన్వాడీల ఓట్లు ప్రభుత్వానికి అవసరం లేదా అని ప్రశ్నించారు. అంగన్వాడీలు బి ఎల్ వో గా పనిచేస్తున్నారని, వారు తలుచుకుంటే ప్రభుత్వాలను పడ కొడతారన్నారు.

చిన్నారులకు బాలింతలకు సేవలు అందించే అంగన్వాడీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడాలని డిమాండ్ చేశారు. వెంటనే చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సిఐటి యూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి , సిపిఎం మండల కార్యదర్శి రవి నాయక్, జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు ,

ఏఐటీయూసీ నాయకులు సయ్యద్, యాదగిరి, అంగన్వాడీలో పార్వతి, మల్లేశ్వరి, ప్రమీల, నిర్మల, స్వరాజ్యం, అరుణ, రాధాబాయి, సైదమ్మ, లక్ష్మి, వజ్రమ్మ, రాణి, సైదాబీ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :