శాయంపేట : అపూర్వ కలయిక

శాయంపేట : అపూర్వ కలయిక

శాయంపేట , మన సాక్షి

హనుమకొండ జిల్లాశాయంపేటమండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1994 – 95 ఏడాదిలో పదవ తరగతి చదువుకున్న  విద్యార్థులు ఆదివారం ఒకే వేదికగా కలుసుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.

 

చదువుకున్న రోజులలో చిన్ననాటి తీపి కబుర్లను, మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ చిన్నపిల్లల్లా కలిసిపోయారు.  తమకు విద్యాబుద్ధులు బోధించిన గురువులు పున్నం యాదవరెడ్డి, కాచం రాజవీరు, సత్యనారాయణరావులను శాలువా, మెమొంటోలతో సత్కరించారు.

 

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గొట్టిముక్కుల రజనీకాంత్, ఉప్పు రాజు, బాసాని శ్రీహరి, కుతాటి రమేష్, మారపల్లి మోహన్ బాబు, మహేందర్రెడ్డి, రజనీకాంత్, గణేష్, ఆదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.