Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsఅభివృద్దితెలంగాణనల్గొండ

Miryalaguda : ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా అదనపు లైట్ల ఏర్పాటు..!

Miryalaguda : ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా అదనపు లైట్ల ఏర్పాటు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక రెడ్డి కాలనీ లోని శ్రీ కోదండ రామాలయం చుట్టుప్రక్కల వీధిలైట్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ధనుర్మాస పూజలు నిమిత్తం కోదండ రామాలయం కు వస్తున్నటువంటి భక్తులకు తెల్లవారుజామున విద్యుత్ దీపాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దాంతో రామాలయం చుట్టూ, వార్డు ప్రధాన కూడలిలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ ఆర్) సహకారంతో పెద్దలైట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వార్డు ప్రజల సౌకర్యార్థం ఎమ్మెల్యే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను వెంటనే తీరుస్తున్నటువంటి బత్తుల లక్ష్మారెడ్డికి వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా మన శాసనసభ్యులు బిఎల్ఆర్ సహకారంతో వార్డులో పెండింగ్ లో ఉన్నటువంటి పనులను అన్నింటిని కూడా రాబోయే రెండు, మూడు నెలల్లో పూర్తి చేస్తామని, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వే జరుగుతుందని గత డిసెంబర్ నెలలో ప్రజా పాలనలో అప్లై చేసుకున్న వారికి వార్డు అధికారి ప్రతి ఇల్లు తిరిగి ఎంక్వయిరీ చేస్తున్నారని, విడతలవారీగా ప్రతి ఒక్క అర్హుడికి ఇల్లు వచ్చేలా చేస్తామని వారన్నారు.
ఈ కార్యక్రమంలో తాళ్ల వెంకటరెడ్డి, గుంటి జనార్దన్, సంతోష్ , కిషోర్ రెడ్డి, చిట్ల శ్రీనివాస్, దైద శ్యాంసుందర్ రెడ్డి, గార్లపాటి దినేష్ రెడ్డి, వెల్డింగ్ శ్రీనివాస్, కంటమణి రాజశేఖర్, మెడికల్ సత్తి, ఓరుగంటి శివకుమార్, సముద్రాల మదన్ కుమార్, ఖర్జూర రవి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు