Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. కళాశాల విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్..!
Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. కళాశాల విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్..!
పీఏ పల్లి, మనసాక్షి :
నల్లగొండ జిల్లాలో దారుణ చోటు చేసుకుంది. మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ చితకబాదాడు. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా పీఏ పల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఫోన్ తీసుకొచ్చిన పాపానికి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి పై ప్రిన్సిపాల్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బుధవారం విద్యార్థుల వద్ద మొబైల్ ఫోన్ దొరకడంతో స్కూలుకు రావద్దు అని ప్రిన్సిపాల్ ఆదేశించారు. మర్చిపోయి పాఠశాలకు తీసుకొచ్చామని విద్యార్థులు ప్రిన్సిపల్ కు చెప్పారు.
కాగా గురువారం స్కూల్ కి వెళ్లిన విద్యార్థులను పాఠశాలకు ఎందుకు వచ్చారాని ప్రిన్సిపాల్ విచ్చలవిడిగా కర్రతో కొట్టాడు. దాంతో విద్యార్థి అపస్మారక స్థితిలో పడిపోయాడు.
విద్యార్థి శరీరంపై ఉన్న గాయాలను చూసిన విద్యార్థులు,తల్లిదండ్రులు బోరున విలపించారు. విద్యార్థిని కర్రతో దాడి చేసిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యార్థి సంఘాల నాయకులు :
యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కలమూరి పరశురాం, యు ఎస్ ఎఫ్ ఐ డివిజన్ సభ్యులు మహమ్మద్ సౌభన్ ఘటనపై మాట్లాడుతూ.. తెలిసి తెలియక విద్యార్థులు తప్పు చేస్తే ఒకసారి చెప్పాలి. కానీ విద్యార్థుల పైన విచ్చలవిడిగా కర్రతో దాడి చేసిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు.
MOST READ :
-
TGSRTC : కార్తీక పౌర్ణమికి ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాలలో ప్రత్యేక బస్సులు..!
-
BREAKING : లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్.. వికారాబాద్ తరలింపు..!
-
Komatireddy Venkatreddy : జిల్లా కలెక్టర్ పై దాడికి పాల్పడిన వారు కేటీఆర్ తో కూడా టచ్ లోనే..!
-
KTR : బిగుస్తున్న ఉచ్చు.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం..!









