మిర్యాలగూడ : ఘనంగా మండల పూజ..!

మిర్యాలగూడ పట్టణము అశోక్ నగర్ లో గల అయ్యప్ప స్వామీ వారి ఆలయం నందు అయ్యప్ప స్వాముల మండల పూజ బుధవారం ఘనంగా నిర్వహించారు.

మిర్యాలగూడ : ఘనంగా మండల పూజ..!

మిర్యాలగూడ ,మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణము అశోక్ నగర్ లో గల అయ్యప్ప స్వామీ వారి ఆలయం నందు అయ్యప్ప స్వాముల మండల పూజ బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం స్వామీ వారి అభిషేఖ కార్యక్రమమును నిర్వహించారు. కార్యక్రమములో వారితో పాటు అడవిదేవులపల్లి, దామరచర్ల జెడ్ పి టి సి లు కుర్రా సేవ్యా నాయక్, అంగోతు లలిత హాతిరాం నాయక్, నాయకులు అన్నభిమోజు నాగార్జున చారి, అయ్యప్ప స్వామీ ఆలయ శాశ్వత చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వర రావు, మాశెట్టి శ్రీనివాస్, గుడిపాటి నవీన్, రాము తదితరులు ఉన్నారు.

ALSO READ : అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!