అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!

మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. సోమవారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ని కలిసి విద్యార్థులకు అందజేసేందుకు నోట్ బుక్స్ బహకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!

మిర్యాలగూడ,  మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. సోమవారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ని కలిసి విద్యార్థులకు అందజేసేందుకు నోట్ బుక్స్ బహకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ALSO READ : రేవంత్ రెడ్డిది ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.. ఆయన రాజకీయం టిఆర్ఎస్ తోనే ప్రారంభం.. సోషల్ మీడియాలో వైరల్..!

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, అందుకు ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. ముఖ్యంగా అన్ని రంగాల, వర్గాల ప్రజలను కలుపుకొని ప్రతి ఒక్కరితో కలిసిపోయి తన వంతుగా అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు.

ALSO READ : BREAKUNG : తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖలు..!

శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు గౌరు శ్రీనివాస్ , బోగవిల్లి వెంకటరమణ చౌదరి, ఉపాధ్యక్షులు గంట సంతోష్ రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రేపాల మధుసూదన్, అసోసియేషన్ నాయకులు బండారు కుశలయ్య తదితరులు పాల్గొన్నారు.