BIG BREAKING : భాస్కర్ రావుకు న్యాయం చేయడమే అలవాటు.. నాకు కుడి భుజం గా ఉన్నారు..!

మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావుకు న్యాయం చేయడమే అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్ లో ప్రజా ఆశీర్వాద సభలో భాస్కరరావును కెసిఆర్ అభినందించారు.

BIG BREAKING : భాస్కర్ రావుకు న్యాయం చేయడమే అలవాటు.. నాకు కుడి భుజం గా ఉన్నారు..!

మిర్యాలగూడలోని ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావుకు న్యాయం చేయడమే అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్ లో ప్రజా ఆశీర్వాద సభలో భాస్కరరావును కెసిఆర్ అభినందించారు.

ఆయన ఏనాడు కూడా సొంత అవసరాల కోసం తన వద్దకు రాలేదని చెప్పారు. సాగునీటి అవసరాలు, మంచినీటి అవసరాలు, రోడ్లు ఇతర ప్రజల అవసరాల కోసం, పనులు చేయాలని వచ్చారే తప్ప తన పని కోసం ఏనాడు కూడా రాలేదన్నారు.

ALSO READ : KCR : గన్ మెన్ కు దండం పెట్టి కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఎందుకో తెలుసా..!

ఎన్నికలు వచ్చాయంటే పోటీ చేసే అభ్యర్థుల వైఖరి చూడాలని, వారు ఏ పార్టీలో ఉన్నారనే విషయం కూడా చూడాలని చెప్పారు. భాస్కర్ రావు తనకు కుడి భుజంగా ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉన్నారని, ముఖ్యమైన సమావేశాలు ఆయన లేకుండా ఎప్పుడూ జరగలేదని కెసిఆర్ పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో భాస్కరరావును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని, ఆయన కోరిన కోరికలన్నీ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ప్రజా ఆశీర్వాద సభలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగు లింగ యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్, మోసిన్ అలీ, నాగార్జున చారి, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BIG BREAKING : టిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగింత..!