నల్గొండ : జనసంద్రంగా సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర

నల్గొండ : జనసంద్రంగా సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర

నల్లగొండ , మన సాక్షి:

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చు పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. సోమవారం 95వ రోజు పాదయాత్ర నల్గొండ జిల్లాలోని
చిన్న సూరారం గ్రామం నుంచి ప్రారంభ‌మైన నకిరేకల్ నియోజకవర్గంలో ప్రవేశించింది.

 

పాదయాత్ర సందర్భంగా బట్టి విక్రమార్కను పలువురు ఉపాధి కూలీలు, నిరుద్యోగులు కలిశారు. తమ కష్టాలను చెప్పుకున్నారు. దీనిపై స్పందించిన సీఎల్పీ నేత భ‌ట్టి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలతో పాలన సాగిస్తున్నాడని విమర్శించారు.

 

వ‌చ్చే ఇందిర‌మ్మ రాజ్యంలో మీ స‌మ‌స్య‌లు తీరిపోతాయ‌ని హామీ ఇచ్చారు. పాదయాత్రకు నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని ఆయన వెంట నడిచారు. దీంతో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జనసంద్రంగా మారింది.

 

Also Read : RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!

 

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొండేటి మల్లయ్య, దైద రవీందర్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నాయకులు కత్తుల కోటి, జూలకంటి సైదిరెడ్డి, ఉప్పునూతల వెంకన్న యాదవ్ తదితరులు ఉన్నారు.

 

Also Read : PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు, కస్టమర్లకు రూ. 2 లక్షల ఆదా…!