Bc Reservations : చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి..!

చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీసీలకు అన్ని పార్టీలు జనాభా దామాషా ప్రకారం సీట్లను కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం 56 కులాలకు 56 ఫెడరేషన్ లు ఏర్పాటు చేయాలని బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు గవ్వల భరత్ డిమాండ్ చేశారు.

Bc Reservations : చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి..!

నల్గొండ, మన సాక్షి:

చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీసీలకు అన్ని పార్టీలు జనాభా దామాషా ప్రకారం సీట్లను కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం 56 కులాలకు 56 ఫెడరేషన్ లు ఏర్పాటు చేయాలని బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు గవ్వల భరత్ డిమాండ్ చేశారు.

శనివారం పట్టణంలోని ఎస్ బి ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు అన్ని పార్టీలు సముచిత న్యాయం కల్పించాలన్నారు. బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం కృషి కి కృషి చేయాలన్నారు.

ALSO READ : Murder : ఇద్దరు చిన్నారుల హత్య.. నిందితుడు ఎన్ కౌంటర్..!

విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ , యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్, బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, ,విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు జిల్లపెల్లి అంజి , సంక్షేమ సంఘం నందగోపాల్,

యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునస ప్రసన్నకుమార్, ప్రధాన కార్యదర్శి మల్లె పోయిన సతీష్, సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్, ఖదీర్ పాషా, సింగం లక్ష్మీనారాయణ, గుండు వెంకటేశ్వర్లు ,భరత్ ,వల కీర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!