బెల్టు షాపులో మందు లభ్యం, వ్యక్తిపై కేసు నమోదు

బెల్టు షాపులో మందు లభ్యం, వ్యక్తిపై కేసు నమోదు

కుల్కచర్ల ,మన సాక్షి:

ఎక్కడపడితే అక్కడ తాగినోడు కి తాగినంత… మందు మస్తుగా దొరుకుతున్నది. ఏ ఊర్లో చూసినా ,సందులో చూసిన బెల్ట్ షాపులు పుట్టగొడుగులెక్క వెలుస్తున్న తరుణంలో బుధవారం కుల్కచర్ల మండల పరిధిలోని కుసుమ సముద్రం గ్రామంలో బరిసెట్టి గోపాల్ (55) కిరాణా దుకాణంలో ఇలాంటి ప్రభుత్వా అనుమతి లేకుండా మందు లిక్కర్ విక్రయిస్తున్నారని తెలిపారు.

సమాచారం తెలుసుకుని కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది తో కలిసి ఆ కిరణ షాపులో సోదా నిర్వహించగా అక్కడ కింగ్ ఫిషర్ ( 12) బీర్లు, డెక్కన్ బ్లూ క్వాటర్స్ (48) సీసాలు దొరకగా వాటిని స్వాధీనం చేసుకొని గోపాల్ పై కేసు నమోదు చేయడమైనదని స్థానిక ఎస్సై అన్వేష్ కుమార్ రెడ్డి తెలిపారు.