Miryalaguda : సేంద్రీయ ఎరువులతో వారి సాగు చేస్తే లాభాలు..!
Miryalaguda : సేంద్రీయ ఎరువులతో వారి సాగు చేస్తే లాభాలు..!
కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి
మిర్యాలగూడ, మన సాక్షి:
సేంద్రియ ఎరువులతో వరి సాగు చేస్తే పంట దిగుబడి పెరుగుతుందని కాంగ్రెస్ కిసాన్ విభాగం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న రైతు వేదికలో ఏ డి ఏ నాగమణి తో కలిసి నేల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రైతులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
వరి పంట పొలాలు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయాలని రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న వరి బోనస్ లు ప్రతి ఒక్క వినియోగించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
వ్యవసాయ అధికారులు రైతులకు సరైన టైంలో సలహాలు సూచనలు ఇవ్వాలని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు వరి పంటలు వేయాలని నష్టపోకుండా, రైతులందరూ భూసార పరీక్షలు చేసుకోవాలని వారి సలహాల మేరకు దిగుబడి ఎక్కువ వస్తుందని తెలిపారు. రైతు కోసిన తర్వాత కోయకాలను కాలపెట్రాదని తెలిపారు.
దాని వలన భూమిలో భూసారం తగ్గిపోతుందని కాబట్టి రైతులందరూ కూడా తగలపెట్టవద్దని వరి పైరు వేసేటప్పుడు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు చేయల్లన్నారు. వరైనా కల్తి విత్తనాలు ఆమ్మినట్లయితే వారి పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, మండల వ్యవసాయ అధికారి సైదా నాయక్, ఏఈఓ లు రైతులు పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : పెన్షన్ల పెంపు అప్పుడే.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!
-
Gold Price : మళ్లీ పెరుగుతున్న గోల్డ్.. మహిళల్లో నిరాశ..!
-
Nalgonda : నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం.. లక్ష మందితో బహిరంగసభ.. మంత్రి కోమటిరెడ్డి..!
-
Teacher : ఎంత పని జరిగింది.. క్లాసులోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు..!









