VIVEKA CASE : చంచల్ గూడ జైలు నుంచి వైయస్ భాస్కర్ రెడ్డి విడుదల..!
VIVEKA CASE : చంచల్ గూడ జైలు నుంచి వైయస్ భాస్కర్ రెడ్డి విడుదల..!
హైదరాబాద్, మనసాక్షి :
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. 12 రోజులపాటు వైయస్ భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు అయింది.
ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు కోర్టుకు చంచల్ గూడ జైలు సూపర్డెంట్ రిపోర్టు ఇచ్చారు. దాంతో మెడికల్ ట్రీట్మెంట్ కోసం వైఎస్ భాస్కర్ రెడ్డికి సిబిఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాదులోని ఆసుపత్రులలో చికిత్స పొందాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ: రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ.. రాజకీయ విమర్శలు చేస్తున్న గుత్తా..!
హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆయనను కోర్టు ఆదేశించింది. అక్టోబర్ మూడవ తేదీన చంచల్ గూడ జైలు సూపర్డెంట్ ముందు సరెండర్ కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా జైలు నుంచి విడుదలైన వైయస్ భాస్కర్ రెడ్డిని చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కు తరలించారు.
ALSO READ : నారాయణపేట : నెలాఖరులోగా రుణమాఫీ ప్రక్రియ పూర్తి.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..!









