Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

BREAKING : భీంగల్ సీఐ నవీన్ బదిలీ..!

BREAKING : భీంగల్ సీఐ నవీన్ బదిలీ..!

నిజామాబాద్ జిల్లా , భీంగల్, మన సాక్షి :

నిజామాబాద్ జిల్లా భీంగల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నవీన్ పై అధికారులు బదిలీవేటు వేసినట్లు సమాచారం. నిజామాబాద్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెళ్లడయ్యాయి. ఇటీవల భీంగల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పలు కేసుల్లో పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. భీంగల్ కు చెందిన సత్య గంగయ్య తన కేసు విషయంలో తన లొకేషన్ ను సీఐ ట్రేస్ చేసి ఇవ్వడంతోనే తనపై దాడి చేయడం జరిగిందని ఆరోపణలు చేశారు.

తనపై దాడికి పూర్తి బాధ్యత సీఐ దేనని ఆర్మూర్ ఏసీపీ విచారణలో బాధితుడు చెప్పినట్టు సమాచారం. ఈ వివాదం నేపథ్యంలో సీఐని నిజామాబాద్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెల్లడైనట్టు సమాచారం. సీఐపై వచ్చిన ఆరోపణలపై పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు