సంబురంగా భోగి వేడుకలు

సంబురంగా భోగి వేడుకలు

మేళ్లచెరువు,మనసాక్షి:సంక్రాతి పండుగ వేడుకల్లో భాగంగా మేళ్లచెరువులోని మై హోమ్ ఇండస్ట్రీస్ శ్రీనగర్ కాలనీలో శనివారం భోగి పండగను కాలనీ వాసులు ఘనంగా జరుపుకున్నారు. ఇళ్ల ముందు రంగురంగూ రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు.అనంతరం వీధుల్లో పెద్ద ఎత్తున భోగి మంటలు వెలిగించి పాత వస్తువులను అందులో వేసి దగ్దం చేశారు. కీడు తొలగిపోవాలని ప్రార్ధించారు.భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఉల్లాసంగా ఆటపాటలతో,మహిళలు కోలాట ప్రదర్శనలతో సందడి చేశారు.

యూనిట్ హెడ్ శ్రీనివాసరావు దంపతులు భోగి మంటలను వెలిగించి వేడుకలను ప్రారంభించారు.బసవన్న తన ఆట పాటలతో,హరిదాసు కీర్తనలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ప్లాంట్ హెడ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మై హోమ్ ఇండస్ట్రీస్ ఉద్యోగులకు, కాలనీవాసులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

కరోనా లాంటి మహమ్మారి మళ్ళీ రాకుండా ఉండాలని, అందరూ సంతోషంగా సంక్రాతి ఘనంగా జరుపుకోవాలని కోరారు.కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధిపతులు, పర్సనల్ జిఎం నాగేశ్వరావు, కాలనీ వాసులు పాల్గొన్నారు.