BREAKING : అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు..!

BREAKING : అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు..!
మన సాక్షి, హైదరాబాద్ :
సినీ నటుడు అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ అయ్యింది. ఆయనకు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ 11 గా ఉన్న విషయం తెలిసిందే. ఈ సంఘటనపై అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
చంచల్ గూడ జైలుకు పంపిన విషయం తెలిసిందే. అతనికి హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెల్ పై ఉన్నాడు. కాగా నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ పెట్టాడు.
దాంతో శుక్రవారం అతనికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 50వేల రూపాయల పూచికత్తుతో ఇద్దరు పూచీ కత్తు, సాక్షులను ప్రభావితం చేయకూడదు, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులకు ఎదుట హాజరు కావాలి. అని కండిషన్ బెయిల్ మంజూరు చేసింది.
దాంతో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ అయ్యింది. కాగా అల్లు అర్జున్ కు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హైకోర్టుకు వెళ్తారా..? లేదా..? అనే విషయం తెలియాల్సి ఉంది.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా కు నిబంధనలు ఖరారు.. దరఖాస్తు ఎలా.. ఎక్కడ చేసుకోవాలి..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..!
-
Hyderabad : సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బాత్రూంలో రహాస్య కెమెరాలు.. విచారణ చేపట్టిన మహిళా కమిషన్..!
-
Rythu Bharosa : రైతు భరోస పై కీలక నిర్ణయం.. మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!









