BRS : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. మరో ఎంపీ రాజీనామా..!

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది.

BRS : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. మరో ఎంపీ రాజీనామా..!

చేవెళ్ల: (మన సాక్షి):?

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు.

ఇదిలా ఉంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకుని చేవెళ్ల నుంచే బరిలో దించాలని చూస్తున్నట్లు సమాచారం.

ఎంపీ రంజిత్ రెడ్డి తో పాటు శంకర్‌పల్లి మండల మరియు మున్సిపాల్టీకి చెందిన బిఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బిఆర్ఎస్ పార్టీకి చేవెళ్ల నియోజకవర్గంలో గట్టి షాక్ తగిలిందని చెప్పాలి.

ALSO READ : Gruhajyothi : అన్ని అర్హతలు ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాదాయే.. అయోమయ పరిస్థితిలో గృహ జ్యోతి..!