BRS : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఆ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు ఆదేశాలు..!
BRS : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఆ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు ఆదేశాలు..!
మన సాక్షి , నల్గొండ :
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం 15 రోజుల గడువు కూడా విధించింది. వివరాల ప్రకారం..
నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును అక్రమంగా, అనుమతి లేకుండా నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూమిలో.. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ కార్యాలయాన్ని నిర్మించారని, అక్రమ కట్టడాన్ని కూల్చేయాలంటూ మున్సిపల్ శాఖ అధికారులను సైతం మంత్రి వెంకట్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు.
దాంతో బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు.. పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతి ఇస్తారని ప్రశ్నించింది.
నిర్మాణం చేపట్టక ముందే అనుమతి తీసుకోవాల్సింది కానీ.. నిర్మాణం చేసిన తర్వాత ఎలా అనుమతి ఇస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అంతే కాకుండా ఒక లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీని హైకోర్టు ఆదేశించింది.
LATEST UPDATE :
Municipal Commissioner : మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు.. ఫుడ్ కోర్టుకు భారీ జరిమానా..!
TG News : తెలంగాణలో నూతన విద్యా విధానం.. 2025 నుంచి ఇంటర్ ఉండదు..!
Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..!









