రాగం లింగయ్య యాదవ్ అద్వర్యం జానయ్య పుట్టినరోజు వేడుకలు

రాగం లింగయ్య యాదవ్ అద్వర్యం జానయ్య పుట్టినరోజు వేడుకలు

సూర్యాపేట, సెప్టెంబర్28 , మనసాక్షి : ఆపదలో ఆపన్నహస్తం అందించే సేవకుడు అభివృద్దే ధ్యేయంగా.. ప్రజల సమస్యలే తన సమస్యగా భావించే నాయకుడు ఎన్ డి సి ఎం ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ జన్మదిన వేడుకల్ని టి ఆర్ ఎస్ ఓ బి సి నాయకులు రాగం లింగయ్య యాదవ్ అద్వర్యం ఘనంగా నిర్వహించారు. గాంధీ నగర్ లో నిర్వహించిన ఈ వేడుకల సందర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ

పేద కుటుంబంలో పుట్టిన జానయ్య యాదవ్ రాజకీయంగా ఎన్నో పదవులు పొందుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆశీస్సులతో ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో మంత్రి సూచనల మేరకు పనిచేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. వారు ఎల్లప్పుడూ ప్రజా జీవితంలో ఉంటూనే అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. ప్రజలకు ఆపద వచ్చిందంటే ముందు వరుసలో నిలబడి సహాయం చేసే సేవకుడీలా పనిచేస్తున్నారని అన్నారు. , వారు చేసే సేవా కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఆశీస్సుల తో వారు ఇంకా ఉన్నత పదవులు పొంది ప్రజలకు, సూర్యాపేటకు వారి సేవలు మరింతగా అందించాలని వారికి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలనింకోరారు.

ALSO READ : ఘనంగా జానయ్య జన్మదిన వేడుకలు

నిరంతరం ప్రజా క్షేత్రంలోనే ఉంటూ ఉన్నతమైన పదవులు పొందుతూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఆ దేవుడు చల్లగా చూడాలని కోరారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్ తన మిత్రుల తో కలిసి జానయ్య యాదవ్ ను ఘనంగా సన్మానించి ,ఆయన చిత్రా పటాన్ని బహుకరించారు.