రాజగోపాల్ రెడ్డి సమక్షంలో 500 మంది బిజెపిలో చేరిక

రాజగోపాల్ రెడ్డి సమక్షంలో 500 మంది బిజెపిలో చేరిక

మునుగోడు, ఆగస్టు23, మనసాక్షి : మునుగోడు మండల కేంద్రంలో మునుగోడు, చండూరు, మర్రిగూడ మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులనుపార్టీల ,యువకులు 500 మందికి పైగా తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పై ఇక యుద్ధం మొదలైందని, బిజెపి పార్టీలో చేరికలను ఎవ్వరు ఆపలేరన్నారు. అమిత్ షా నాయకత్వంలో పనిచేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పార్టీ పెద్దలతో యువకులతో, మేధావులతో కలిసి ముందుకు సాగుతానన్నారు. అనంతరం మండల చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఆయన వెంట బిజెపి నాయకులు దోనూరు వీరారెడ్డి, కుంభం శ్రీనివాస్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ,దోటి వెంకన్న,పల్లె వెంకన్న, పలువురు నాయకులు ఉన్నారు.