సూర్యాపేట : వచ్చే ఎన్నికల్లో మహిళలు బీజేపీ ని ఆశీర్వదించాలి

వచ్చే ఎన్నికల్లో మహిళలు బీజేపీ ని ఆశీర్వదించాలి
సంకినేని వెంకటేశ్వరరావు
సూర్యాపేట, మనసాక్షి
వచ్చే ఎన్నికల్లో మహిళలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ప్రభుత్వం ఏర్పాటు కు కృషి చేయాలని బి జె పి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు కోరారు.
భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా సూర్యపేట పట్టణ కార్యవర్గ సమావేశం మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బూర శకుంతల ఆధ్వర్యంలో నిర్వహించారు..
ఈ సమావేశాములో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాలుగోని ప్రసంగించారు.
Also Read : Central scheme : కేంద్ర ప్రభుత్వ పథకం.. నెలకు రూ. 10 వేలు ఎవరైనా పొందొచ్చు
కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత రక్షణ కరువైంది.. ఎక్కడ చూసినా మహిళలపై హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి.
కానీ మహిళలకు న్యాయం మాత్రం జరగట్లేదన్నారు.
ఆడబిడ్డల పుస్తెలు తెంపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రోజురోజుకు ప్రజలను మద్యానికి బానిస చేసి మద్యంపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు.
మహిళలు ఆర్థికంగా ఎదగడానికి గత ప్రభుత్వాలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేది… కానీ కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మహిళల ఆర్థిక భద్రతను గాలికి వదిలేశారన్నారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా 250 కోట్లు ఖర్చు పెట్టి చీరలు తెచ్చిన దానిలో కూడా అవినీతికి పాల్పడి కేజీల చొప్పన అమ్మే సిల్క్ చీరలు ఇచ్చి తెలంగాణ మహిళలను ముఖ్యమంత్రి కెసిఆర్ అగౌరవపరిచారని విమర్శించారు.
స్వచ్ఛభారత్ పథకం ద్వారా ప్రతి ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 12 వేల రూపాయలు మంజూరు చేసిందని గుర్తుచేశారు.
మహిళలు చైతన్యవంతం కావాలి.
Also Read : Smart phone : మీ ఫోన్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి చాలు..!
ఉత్తరప్రదేశ్లో మహిళలపై కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి ఉందని అలాంటి పరిపాలన మన తెలంగాణలో రావాలంటే మహిళలు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలంతా వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , భారతీయ జనతా పార్టీకి అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య , ఉచిత వైద్యం అందిస్తారని.
మరియు ఇండ్లు లేని వారందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇండ్లు కట్టిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ఇన్చార్జ్ కరణం పరిణిత, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు అయినాపురపు శ్యామల గౌరి, కౌన్సిలర్లు సలిగంటి సరిత, పలస మహాలక్ష్మి, పట్టణ నాయకురాలు నాగారపు మనేమ్మ, గరిగంటి సమత, దోసకాయల మౌనిక, మీరు పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.