Breaking Newsక్రైంజాతీయం

Breaking : నలంద శీతలమాత దేవి ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..!

బీహార్ లోని నలంద శీతల దేవి ఆలయంలో మంగళవారం తొక్కిసలాట జరిగింది. 8 మంది భక్తులు మృతి చెందగా మరో 12 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

Breaking : నలంద శీతలమాత దేవి ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..!

మనసాక్షి, వెబ్ డెస్క్ :

బీహార్ లోని నలంద శీతల దేవి ఆలయంలో మంగళవారం తొక్కిసలాట జరిగింది. 8 మంది భక్తులు మృతి చెందగా మరో 12 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అధిక రద్దీ కారణంగా భక్తుల మధ్య తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

శీతల మాత ప్రత్యేకత :

శీతల మాత ప్రత్యేకత ఏంటంటే..? శీతలాష్టమి రోజున ఇళ్లలో పోయిలు వెలిగించరు. ఇక్కడ అది ఒక ప్రత్యేక సాంప్రదాయం. ఒకరోజు ముందు తయారు చేసిన వంటకం (చద్దన్నం) శీతలమాత అమ్మవారికి భక్తులు సమర్పిస్తారు. అయితే చద్దన్నం అమ్మవారికి సమర్పిస్తే దుష్టశక్తులు తమను వదిలిపోతాయని భక్తుల నమ్మకం.

చైత్రమాసం చివరి మంగళవారం రోజున శీతలమాతకు ప్రసాదమును సమర్పిస్తారు. దీనిని బీహార్ లో బస్సీ అంటారు. శీతలమాతకు చద్దన్నం సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దాంతో మహిళలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఆలయం లోపల స్థలం తక్కువగా ఉండడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహిళలు చనిపోయారు.

మరిన్ని వార్తలు