నల్గొండBreaking Newsజిల్లా వార్తలురాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ జోరు.. అభ్యర్థులకు బీఫారాల పంపిణీ..!

మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల బరిలో నిలవనున్న 42 మంది బిఆర్ఎస్ అభ్యర్థులకు పార్టీ అధికారికంగా బి-ఫారాలను అందజేసింది.

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ జోరు.. అభ్యర్థులకు బీఫారాల పంపిణీ..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల బరిలో నిలవనున్న 42 మంది బిఆర్ఎస్ అభ్యర్థులకు పార్టీ అధికారికంగా బి-ఫారాలను అందజేసింది.

మున్సిపాలిటీ ఎన్నికల సమన్వయకర్త, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ , మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు చేతులమీదుగా అభ్యర్థులకు ఫారాలను అందజేశారు.

ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికల సమన్వయకర్త, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ గతంలో చేసిన అభివృద్ధి పనులే మనల్ని గెలిపిస్తాయని, ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా, ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటూ విజయం దిశగా అడుగులు వేయండి అని ఆయన అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లాలన్నారు.

మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ అభ్యర్థులందరూ సమన్వయంతో పనిచేసి గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మనం చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తోంది. ప్రతి గల్లీలోనూ, ప్రతి వార్డులోనూ మనం వేసిన రోడ్లు, చేసిన పనులే మన తరపున సాక్ష్యం చెబుతాయి. 42 వార్డుల్లోనూ పార్టీ పటిష్టంగా ఉందని, విజయం మనదేనని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, అన్నభిమోజు నాగార్జున చారి, చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, నల్లమోతు సిద్దార్ధ, దుర్గంపూడి నారాయణరెడ్డి, హతిరాం నాయక్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, మట్టపల్లి సైదులు యాదవ్,

కట్టా మల్లేష్ గౌడ్ చౌగాని బిక్షం గౌడ్, బాలాజీ నాయక్, కుర్ర శ్రీను నాయక్, అశోక్ రెడ్డి, మాజీ సింగల్ విండో చైర్మన్, బంటు శ్రీనివాస్, పోకల రాజు, జొన్నలగడ్డ రంగారెడ్డి, చిర్ర మల్లయ్య, సుధాకర్ రెడ్డి, పేరాల కృపాకర్ రావు, కౌన్సిలర్ అభ్యర్థులు, మాజీ కౌన్సిలర్లు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST READ 

  1. Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య.. నల్లగొండను మహా నగరంగా తీర్చిదిద్దుతా..!

  2. NLG : రైతు నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!

  3. Miryalaguda : రాజకీయ దురుద్దేశంతోనే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు..!

  4. Rythu Bharosa : రైతు భరోసా శాటిలైట్ సర్వే పూర్తి.. షాకింగ్ నిజాలు, లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు