బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు..!

బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు..!
కంగ్టి, మన సాక్షి :
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు సంక్షేమ ఫలాలను ఆకర్షితులై వివిధ పార్టీలను నుంచి బిఆర్ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు.
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుర్కవడ్గవ్ గ్రామానికి చెందిన శనివారం క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే సమక్షంలో వార్డ్ మెంబర్ దిలీప్ కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ లో చేరారు. వారితో పాటుగా సోమనాథ్, ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు పార్టీలు చేరగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో మోషప్ప,రమేష్,సచిన్,ఆకాష్,హెజ్కల్,రాజు మరియు వారి కుటుంబాలు చేరినారు. అనంతరం దిలీప్ మాట్లాడుతూ తమ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కి మా తాతల నుండి మా వరకు అధికారం ఇచ్చిన వ్యవస్థలో ఎటువంటి మార్పు లేదని,భూపాల్ రెడ్డి సారధ్యంలో నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుందని తమ గ్రామంలో మునుపెన్నడూ లేని అభివృద్ధి పనులు జరిగినాయి అని బిఆర్ఎస్ లో చెరినాం అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బసన్ని,రాజప్ప,తదితరులు పాల్గొన్నారు