Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

మిర్యాలగూడ : బహిరంగ సభను తలపించేలా బిఆర్ఎస్ ప్లీనరీ

మిర్యాలగూడ : బహిరంగ సభను తలపించేలా బిఆర్ఎస్ ప్లీనరీ

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడలో పట్టణంలోని శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్ లో జరిగిన బి.ఆర్.యస్ పార్టీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం బహిరంగ సభను తలపించేలా ఉంది. సమావేశానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

 

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు , బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల అనుసారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అధ్యక్షతన మిర్యాలగూడ నియోజకవర్గం లో వాడ వాడల జెండావిష్కరణలు చేసి గులాబీ మయం చేయడం జరిగింది.

 

ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన నియోజకవర్గ ప్లీనరీ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి యువ నాయకులు నల్లమోతు సిద్దార్థ ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేసి అమరవీరులను స్మరిస్తూ వారికీ నివాళ్ళు అర్పించి సభను ప్రారంభించి తెలంగాణ ఏర్పడిన తర్వాత సాధించినటువంటి అభివృద్ధి ఫలాలను, నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలకు తెలియపరచి తీర్మానాలను నియోజకవర్గ బి.ఆర్.ఎస్ నాయకులు ప్రవేశపెట్టారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి , రైతు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డీడీ ఎం ఎస్ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, కుందూరు వీరకోటి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు,

 

మండలాల ఎం.పి.పి లు, జెడ్ పీ టీసీలు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, మాజీ జిల్లా రైతు సంఘం అద్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, సీనియర్ నాయకులు అన్నభిమోజు నాగార్జున చారి, మదార్ బాబా, యూసుఫ్, పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, పార్టీ అద్యక్షులు, సోషల్ మీడియా అద్యక్ష ప్రతినిధులు, అన్ని కమిటిల అద్యక్షులు, ఉపాధ్యక్షులు, సర్పంచులు, ఎం.పీ.టీ.సీలు పట్టణ కౌన్సిలర్లు, బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు