బీఆర్ఎస్ కు భారీ షాక్.. నలుగురు సర్పంచులు రాజీనామా, కాంగ్రెస్ పార్టీలోకి చేరిక..!

అధికార బి ఆర్ ఎస్ పార్టీ కి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. మంగళవారం మండల కేంద్రంలో తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామల్ సమక్షంలో తిమ్మాపురం, రామన్నగూడెం, సూర్య నాయక్ తండ, కోమటిపల్లి గ్రామాల సర్పంచులు ఉపసర్పంచులు మాజీ సర్పంచులు వార్డు సభ్యులు వందలాదిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బీఆర్ఎస్ కు భారీ షాక్.. నలుగురు సర్పంచులు రాజీనామా, కాంగ్రెస్ పార్టీలోకి చేరిక..!

అర్వపల్లి , మన సాక్షి

అధికార బి ఆర్ ఎస్ పార్టీ కి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. మంగళవారం మండల కేంద్రంలో తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామల్ సమక్షంలో తిమ్మాపురం, రామన్నగూడెం, సూర్య నాయక్ తండ, కోమటిపల్లి గ్రామాల సర్పంచులు ఉపసర్పంచులు మాజీ సర్పంచులు వార్డు సభ్యులు వందలాదిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అదేవిధంగా జాజిరెడ్డిగూడెం అర్వపల్లి ,పర్సపెల్లి, వేల్పుచర్ల, కొత్తగూడెం గ్రామాల నుండి నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. మాజీ సర్పంచుల ఆధ్వర్యంలో కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలు కట్టుకున్నారు.

ALSO READ : Elections : ఎన్నికల్లో ఓటు వేస్తారా.. ఆ సెకండ్లే కీలకం.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు యోగానంద చార్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నరసింహ శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి కె ఐలయ్య, భీముడు, రవీందర్ నాయక్, జాల నరసయ్య, వంగూరి వెంకటమ్మ, సోమశేఖర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీలోకి భారీ వలసలు..!