మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీలోకి భారీ వలసలు..!

మిర్యాలగూడ మండలం ముక్కల కాల్వ గ్రామం నుంచి బి.ఆర్. ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ దారం సైదులు,వార్డ్ మెంబర్ శ్రీలోజు సైథా చారి,బిఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షులు మహ్మద్ సలీం, యూత్ నర్సింగోజ్ సైదులులతో పాటు బిఆర్ఎస్ నాయకులు 100 మంది కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీలోకి భారీ వలసలు..!

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరికలు

మిర్యాలగూడ టౌన్,  మన సాక్షి:

మిర్యాలగూడ మండలం ముక్కల కాల్వ గ్రామం నుంచి బి.ఆర్. ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ దారం సైదులు,వార్డ్ మెంబర్ శ్రీలోజు సైథా చారి,బిఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షులు మహ్మద్ సలీం, యూత్ నర్సింగోజ్ సైదులులతో పాటు బిఆర్ఎస్ నాయకులు 100 మంది కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

పట్టణంలోని 15వ వార్డ్ కౌన్సిలర్ రునాల్ రెడ్డి, మెరెడ్ల వెంకట రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ జెండా కప్పి ఆహ్వానించారు.

ALSO READ : Elections : ఎన్నికల్లో ఓటు వేస్తారా.. ఆ సెకండ్లే కీలకం.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

* వేములపల్లి మండలం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు చలబొట్ల శ్రీనివాస్ రెడ్డి, ముదిరెడ్డి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది BRS నాయకులు , బత్తుల లక్ష్మారెడ్డి – BLR గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడ బోయిన అర్జున్, sc సెల్ ఉపాధ్యక్షులు పుట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

• గోగువారి గూడెం గ్రామానికి చెందిన 50 మంది BRS పార్టీ కార్యకర్తలు బత్తుల లక్ష్మారెడ్డి – BLR గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

ALSO EAD : ప్రాణం తీసిన కురుకురే ఫ్యాకెట్..!

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం నియోజకవర్గంలోని కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రగిరెడ్డి జగ్గా రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కొండా జోష్, ఉపాధ్యక్షులు అమరారపు శ్రీను, బొడ్డు వెంకన్న, కుర్ర వెంకన్న, పోలగాని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.