హస్తం గూటికి టిఆర్ఎస్ నాయకులు

హస్తం గూటికి టిఆర్ఎస్ నాయకులు
కుల్కచర్ల, మన సాక్షి ప్రతినిధి:
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలో ఆదివారం రాంరెడ్డి పల్లి గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు 50 మంది కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి
ఆధ్వర్యంలో బిఆర్ యస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో 50 మంది చేరడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాడు. కాంగ్రెస్ వస్తే పేదలకు ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ తక్షణమే చేస్తామని నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని చెప్పారు.
ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్,
జిల్లా జనరల్ సెక్రెటరీ హనుమంతు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ, పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ,జిల్లా కార్యదర్శులు నర్సింలు యాదవ్ అడ్వకేట్, జిల్లా కార్యదర్శి యాదయ్య ముదిరాజ్, వి జంగయ్య, తిరుమలయ్య,
వెంకటేష్, అరుణ్, దస్తయ్య, ఎల్లయ్య, శ్రీనివాస్, డాన్, వినయ్, కుమ్మరి జంగయ్య, గోపాల్, రమేష్, నర్సింలు, పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.