Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా

FTL : బఫర్ జోన్, FTLలో అక్రమ నిర్మాణాలు చేస్తే తొలగిస్తాం.. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరిక..!

FTL : బఫర్ జోన్, FTLలో అక్రమ నిర్మాణాలు చేస్తే తొలగిస్తాం.. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరిక..!

లక్షేట్టిపేట్, (మన సాక్షి)

మంచిర్యాల జిల్లాలోని ఎఫ్.టి.ఎల్.బఫర్ జోన్లలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణ పరిధిలోని ఇటిక్యాల, బొట్లకుంట చెరువులను మున్సిపల్ కమీషనర్ కల్లెడ రాజశేఖర్, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, ఇరిగేషన్ ఈ.ఈ.లతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్లలో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణాలకు పాల్పడినట్లయితే తొలగించడం జరుగుతుందని తెలిపారు.

ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్ల పరిధిలోని భూములను గుర్తించి ఇట్టి భూములలో ఏమైనా నిర్మాణాలు ఉన్నట్లయితే వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Rythu Barosa : రైతులకు శుభవార్త, రైతు భరోసాపై క్లారిటీ.. వారికి మాత్రమే, మంత్రి తుమ్మల కీలక ప్రకటన..!

 Nalgonda : ప్రజాపాలన దినోత్సవం ఎప్పుడో తెలుసా.. జిల్లా కలెక్టర్ ప్రశ్నకు విద్యార్థుల సమాధానం..!

Peddapalli : భూ ఆక్రమణలపై కఠిన చర్యలు.. అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల..!

Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!

మరిన్ని వార్తలు