ఎదురెదురుగా రెండు బైకులు ఢీ.. ఓ వ్యక్తి మృతి..!

ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది.

ఎదురెదురుగా రెండు బైకులు ఢీ.. ఓ వ్యక్తి మృతి..!

కుల్కచర్ల,మన సాక్షి:

ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది.

ఈ సంఘటన కు సంబంధించి కుల్కచర్ల ఎస్ఐ రాసుల శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం..కుల్కచర్ల మండల పరిధిలోని బండ వెల్కీచర్ల గ్రామానికి చెందిన పేర్కంపల్లి బాలకృష్ణ (21) శనివారం  రాత్రి పని నిమిత్తం తన టీఎస్ 34 బి 69 08 గల ద్విచక్ర వాహనంపై కుల్కచర్ల కు వెళ్తున్నాడు.

ALSO READ : BREAKING : రైతుబంధు అందరికీ రాదు, వారికి మాత్రమే వస్తుంది.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

బొంరెడ్డిపల్లీ కి వెళ్లే రోడ్డు దగ్గరికి రాగానే కుల్కచర్ల నుండి టీఎస్ 07 ఈ 52 27 గల ద్విచక్ర వాహనంపై అతి వేగంతో బాలకృష్ణ వాహనాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలైన అతడిని మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మద్యమం లోనే మరణించడం జరిగింది… మృతుడి భార్య నందిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు కుల్కచర్ల ఎస్ఐ రాశుల శ్రీశైలం తెలిపారు.

ALSO READ : ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పథకం కింద రూ.5లక్షల సహాయం..!