Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

BREAKING : రైతుబంధు అందరికీ రాదు, వారికి మాత్రమే వస్తుంది.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

BREAKING : రైతుబంధు అందరికీ రాదు, వారికి మాత్రమే వస్తుంది.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతు బంధు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధు అర్హులైన రైతులకు అందేలా చూస్తామని ఆయన ప్రకటించారు. అనర్హులకు రైతు భరోసా ఇవ్వమని, వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

బడ్జెట్ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బడ్జెట్ వాస్తవాలకు అనుగుణంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదేళ్లయినా.. కేసీఆర్ కు బడ్జెట్ అంచనా వేయడం రాలేదని విమర్శించారు. అబద్ధాలు చెబితే కప్పిపుచ్చుకోవడానికి సంవత్సరం మొత్తం అబద్ధాలు చెప్పాల్సి ఉంటుందన్నారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ రూపొందించినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అబద్దాల ప్రాతిపదికన బడ్జెట్ పెట్టదలుచుకోలేదని ఆయన తేల్చి చెప్పారు.

ALSO READ : ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పథకం కింద రూ.5లక్షల సహాయం..!

వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించిన బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రైతు రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ బరాబర్ రద్దు చేస్తామని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తప్పకుండా రాబడతామన్నారు.

గత ప్రభుత్వ అవినీతి పై విచారణ :

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణాలపై విచారణ జరిపించనున్నట్లు ఆయన తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ జరిపామని.. జ్యుడీషియల్ విచారణలో అసలు విషయాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

ALSO READ : Good News : అసెంబ్లీ వేదికగా రైతులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..! 

మేడిగడ్డ వెళ్దామని ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించానని , బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈనెల 13వ తేదీన మీటింగ్ ఉంటే వేరే తేది చెప్పినా కూడా వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ అగ్రనేతలు అవమానాలకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చే అంశం తన దృష్టిలో లేదని, ఎవరైనా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంటే అలాంటి వారి విషయంలో తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ALSO READ : BIG REAKING : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు..!

మరిన్ని వార్తలు