Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

BIG REAKING : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు..!

BIG REAKING : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు..!

మన సాక్షి : వెబ్ డెస్క్:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై మూడు వారాల్లో స్పందించాలని పేర్కొన్నది.

వివరాల ప్రకారం .. అప్పట్లో పెను సంచలనం కలిగించిన ఓటుకు నోటు కేసులో విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విచారణ మధ్యప్రదేశ్ లోని భూపాల్ కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు జగదీశ్ రెడ్డి దాఖలు చేశారు.

ALSO READ : గ్రూప్-1 అభ్యర్థులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..!

ఈ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను భోపాల్ కు బదిలీ చేయాలన్న విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులకు నాలుగు వారాల్లో స్పందించాలని పేర్కొన్నది. అయితే రేవంత్ రెడ్డి , తెలంగాణ ప్రభుత్వం ఈ నోటీసులను ఎలా తీసుకుంటుంది…? వారి స్పందన ఎలా ఉంటుంది..? ఏం జరగబోతుంది..? అనే దానిపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొన్నది.

ALSO READ : BRS : బీఆర్ఎస్ లో నల్గొండ ఎంపీ టికెట్ కు పోటాపోటీ..!

మరిన్ని వార్తలు