BRS : బీఆర్ఎస్ లో నల్గొండ ఎంపీ టికెట్ కు గుత్తా వర్సెస్ జగదీష్ రెడ్డి..!

ప్రతిపక్ష టిఆర్ఎస్ లో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. నల్గొండ జిల్లాలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుకేందర్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు సమాచారం.

BRS : బీఆర్ఎస్ లో నల్గొండ ఎంపీ టికెట్ కు గుత్తా వర్సెస్ జగదీష్ రెడ్డి..!

నల్గొండ , మన సాక్షి :

లోకసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ లో కూడా ఎంపీ టికెట్ కు పోటాపోటీగా ఉన్నారు. ముఖ్యంగా నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఎంపీ టికెట్ కు పోటీ చేయడానికి చాలామంది ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తుంది. పోటీ చేయడానికి కొంతమంది ఉత్సాహంగా ఉండటంతో పాటు పార్టీ అధిష్టానం కూడా మరి కొంతమందిని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

నల్లగొండ పార్లమెంటు టికెట్ కేటాయింపులో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు సమాచారం. గుత్తా సుకేందర్ రెడ్డి తన కుమారుడు అమిత్ రెడ్డికి టికెట్ కేటాయించాలని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా జగదీష్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతూ గుత్తాకు చెక్ పెట్టె ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట ఉన్నాయి. సూర్యాపేట నియోజకవర్గం లో మాత్రమే బీఆర్ఎస్ శాసనసభ్యులుగా ఉన్నారు. మిగతా అన్ని నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ALSO READ : నల్గొండ : మద్యం మత్తులో విధులకు హాజరైన ఎగ్జామినర్..?
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నారని సుఖేందర్ రెడ్డి కూడా ప్రకటించిన విషయం విధితమే. అంతేకాకుండా గుత్తా అమిత్ రెడ్డి కూడా పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ లో సీనియర్ నాయకులుగా ఉన్న సుంకరి మల్లేష్ గౌడ్ ఎంపీ టికెట్ కు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన గతంలో కూడా ఎంపీ టికెట్ కు పోటీచేసి ఓడిపోయిన విషయం విధితమే. ఈసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీలో కొనసాగుతున్న మరో ముఖ్యమైన నేత చాడ కిషన్ రెడ్డి.. ఆయన వర్గీయులు కూడా పార్లమెంటుకు పోటీ చేయాలని పేర్కొంటున్నట్లు తెలుస్తుంది. ఆయన నల్లగొండ అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమైనప్పటికీ సిట్టింగ్‌ లకు కేసీఆర్ టికెట్లు ఇవ్వడం వల్ల ఆయన పార్టీ ఆదేశాల మేరకు పనిచేశారు. ఈసారి పార్లమెంటుకు పోటీ చేయడానికి ఆయన సిద్ధమయ్యారు.

ALSO READ : BREAKING : నల్గొండ జిల్లాలో రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి..!

దాంతో పాటు పార్టీ అధిష్టానం కూడా నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను, అదే విధంగా మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావును సైతం పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో అధిష్టానం ఎవరి వైపు మగ్గుతుందో చూడాల్సి ఉంది.

తనయుడి కోసం గుత్తా ప్రయత్నం :

గుత్తా సుఖేందర్రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉన్నారు. పార్లమెంటు సభ్యులుగా, శాసనమండలి చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి ఎలాంటి రాజకీయాల్లోకి రాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి గుత్తా అమిత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని, మునుగోడు టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ విషయం విధితమే. కాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గుత్తా సుఖేందర్రెడ్డి తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచనతో ఈ ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ALSO READ : Delivery Boys : పేరుకే డెలివరీ బాయ్స్.. వాళ్ళ డెలివరీ చేసేది చూస్తే షాక్..!

గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఎన్నికలతో గుత్తా అమిత్ రెడ్డిని రాజకీయ అరంగేట్రం చేయిస్తే ఆ తర్వాత రాబోయే ఎన్నికల నాటికి రాజకీయంగా ఎదుగుతాడని భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఎలాంటి అనుభవం లేని గుత్తా అమిత్ రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇస్తుందా..? లేదా..? అనేది ప్రశ్నార్ధకంగా ఉంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అమిత్ రెడ్డికి పార్లమెంట్ టికెట్ ఇస్తే అన్ని నియోజకవర్గాలలో నాయకత్వం కలిసి పనిచేస్తుందా..? లేదా..? అని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రతిపక్ష బీఆర్ఎస్ లో కూడా పార్లమెంటు టికెట్ల కోసం పోటాపోటీ కొనసాగుతుంది.

ALSO READ : రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఆ కుటుంబాల వారికేనా. తెల్ల రేషన్ కార్డు ఉన్నా.. దండగేనా..!

జగదీశ్ రెడ్డి నల్లగొండ పార్లమెంటు పరిధిలో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా జగదీశ్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. నల్లగొండ పార్లమెంటు టికెట్ తన అనుచరుడికి కేటాయించే విధంగా పావులు కలుపుతున్నట్లు సమాచారం. పార్లమెంటుకు పోటీ చేయడానికి తన అనుచరుడిని తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కొత్త వ్యక్తులకు గతంలో రాజకీయ అనుభవం లేని వ్యక్తులకు పార్లమెంటు టికెట్ ఇస్తే పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అధిష్టానం దృష్టికి జగదీశ్ రెడ్డి తీసుకెళ్లినట్లు తెలిసింది.