రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఆ కుటుంబాల వారికేనా. తెల్ల రేషన్ కార్డు ఉన్నా.. దండగేనా..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను వంద రోజులలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రెండు గ్యారెంటీ హామీలు అమలు చేస్తుండగా మరో రెండు గ్యారెంటీ హామీలు ఫిబ్రవరి మాసం నుంచి అమలు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.

రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఆ కుటుంబాల వారికేనా. తెల్ల రేషన్ కార్డు ఉన్నా.. దండగేనా..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను వంద రోజులలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రెండు గ్యారెంటీ హామీలు అమలు చేస్తుండగా మరో రెండు గ్యారెంటీ హామీలు ఫిబ్రవరి మాసం నుంచి అమలు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. అందులో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేసే పథకం కు వేగవంతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ఇదివరకు ప్రకటించిన విషయం విధితమే.

తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో 64 లక్షల తెల్ల రేషన్ కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లుగా పౌరసరఫరాల శాఖ గుర్తించింది. కాగా దీంతో మిగిలిన 26 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు లేనట్టే రికార్డుల్లో ఉంది. కాగా తెల్ల రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు రికార్డులలో లేకుంటే వారికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అందుతుందా..? లేదా..? అనేది ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది.


పౌరసరఫరాల శాఖ తోపాటు గ్యాస్ ఏజెన్సీల వద్ద కూడా ఉన్న లెక్కల ప్రకారం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లుగా గుర్తిస్తేనే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందించే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ ఉన్నా తెల్ల రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డులో గ్యాస్ సిలిండర్ ఉన్నట్లు లేకుంటే కార్డు ఉన్నా.. దండగే.

ALSO READ : Nalgonda : ప్రేమ జంటలను బెదిరించి ఆభరణాలు, డబ్బులు దోపిడీ.. ముఠా అరెస్ట్..!

చాలామంది వంట గ్యాస్ కనెక్షన్ తీసుకునే సమయంలోనే తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చి కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొంతమంది రేషన్ కార్డు ,ఆధార్ కార్డు లేకుండా కొనుగోలు చేసిన వారు ఈ కేవైసీ ద్వారా లింకు చేసుకున్నారు. కానీ కొంతమందికి గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు బుక్ లేకపోవడం, కొంతమందికి తెల్ల రేషన్ కార్డు ఉన్నా కూడా గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు రికార్డుల్లో నమోదు కాకపోవడంతో ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. వీరందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నా.. గ్యాస్ కనెక్షన్ లేనట్లు రికార్డుల్లో ఉంటే 500 రూపాయలకు గ్యాస్ కనెక్షన్ అందడం కష్టమే.

ALSO READ : Gruhajyothi : గృహజ్యోతి.. 200 యూనిట్ల ఉచిత విద్యుతుకు బ్రేక్..!