BREAKING : నల్గొండ జిల్లాలో రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి..!

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో ఆర్ ఐ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

BREAKING : నల్గొండ జిల్లాలో రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి..!

కొండ మల్లేపల్లి, మన సాక్షి:

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో ఆర్ ఐ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే కేశ్య తండా గ్రామానికి బానవత్ లచ్చుకు సంభందించిన భూమి వివరాలు రికార్డుల్లో నమోదు చేసేందుకు ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి 30 వేల రూపాయలు డిమాండ్ చేశారు.

ALSO READ : Delivery Boys : పేరుకే డెలివరీ బాయ్స్.. వాళ్ళ డెలివరీ చేసేది చూస్తే షాక్..!

ఈ క్రమంలో రైతు బాణవత్ లచ్చు చేసేది ఎం లేక 30 వేల రూపాయలు లంచం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ని కలిసి ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి మీద పిర్యాదు చేసాడు. అయితే గురువారం  రైతు బాణవత్ లచ్చు వద్ద నుండి 30 వేలు రూపాయలను దేవరకొండ లోని మీనాక్షి సెంటర్ వద్ద తన కార్ లో తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

గతంలో ఇతను పై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కాగా ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సదరు రైతు వద్ద నుంచి డబ్బులు తీసుకున్నది నిజమైన అని ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నారు.

ALSO READ : రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఆ కుటుంబాల వారికేనా. తెల్ల రేషన్ కార్డు ఉన్నా.. దండగేనా..!