Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణవ్యవసాయం

Good News : అసెంబ్లీ వేదికగా రైతులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..! 

Good News : అసెంబ్లీ వేదికగా రైతులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..! 

మన సాక్షి ,వెబ్ డెస్క్:

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను 100 రోజులలో అమలు చేస్తామని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి కసరత్తు కొనసాగుతుంది.

ఇప్పటికే రెండు గ్యారెంటీ హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.. మరో రెండు గ్యారెంటీ హామీలను అతి త్వరలో అమలు చేయడానికి అధికార యంత్రాంగం నిర్వహిస్తుంది. ఈ నెలాఖరులోగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడానికి కసరత్త కొనసాగుతుంది.

ALSO READ : BIG REAKING : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు..!

అదేవిధంగా అసెంబ్లీ వేదికగా రైతులకు రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ తెలియజేశారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఇంకా డబ్బులు రాలేదని చెబుతున్నారని గత ప్రభుత్వం మాదిరిగానే కొంత ఆలస్యమైనట్లు పేర్కొన్నారు. 2018 లో రైతుబంధు పంపిణీ ఐదు నెలల పాటు కొనసాగిందని, 2020 లో ఏకంగా తొమ్మిది నెలల పాటు రైతుబంధు పంపిణీ చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా 2021, 2022లో కూడా రైతుబంధు నిధులు రైతులకు బ్యాంకు ఖాతాలో పడటానికి నాలుగు నెలల సమయం పట్టినట్లు ఆయన గుర్తు చేశారు.

ఇక మా ప్రభుత్వం వచ్చి 60 రోజులు కూడా రావడం లేదని విమర్శలు చేయడం సరికాదన్నారు. 100 రోజులలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ALSO READ : నల్గొండ : మద్యం మత్తులో విధులకు హాజరైన ఎగ్జామినర్..?

రైతు భరోసా పథకంలో వచ్చే వానకాలం సీజన్ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. వానాకాలం సీజన్ జూన్ మాసంలో ప్రారంభమవుతున్నందున జూన్ 1వ తేదీ నుంచి రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

రైతు భరోసా పథకం ద్వారా ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల మేరకు ఎకరాకు 15 వేల రూపాయలు అందిస్తానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రతి ఎకరాకు వానాకాలం సీజన్ లో రూ.7500 యాసంగి సీజన్ లో రూ. 7500 నేరుగా బ్యాంకు ఖాతాలో వేయనున్నట్లు తెలియజేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు.

ALSO READ : BRS : బీఆర్ఎస్ లో నల్గొండ ఎంపీ టికెట్ కు పోటాపోటీ..!

మరిన్ని వార్తలు