ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పథకం కింద రూ.5లక్షల సహాయం..!

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుకు సిద్ధమైంది. ముందుగా 6 గ్యారంటీలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రిమండలి ఆమోదం చేసింది. ఇప్పటికే రెండు గ్యారెంటీ హామీలను అమలు చేస్తుండగా ఈనెలాఖరులోగా మరో రెండు గ్యారెంటీ హామీలను అమలు చేసేందుకు కసరత్తు కొనసాగుతుంది.

ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పథకం కింద రూ.5లక్షల సహాయం..!

డిప్యూటీ సి ఎం భట్టి విక్రమార్క వెల్లడి

మనసాక్షి , వెబ్ డెస్క్ :

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుకు సిద్ధమైంది. ముందుగా 6 గ్యారంటీలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రిమండలి ఆమోదం చేసింది. ఇప్పటికే రెండు గ్యారెంటీ హామీలను అమలు చేస్తుండగా ఈనెలాఖరులోగా మరో రెండు గ్యారెంటీ హామీలను అమలు చేసేందుకు కసరత్తు కొనసాగుతుంది.

ALSO READ : Good News : అసెంబ్లీ వేదికగా రైతులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..! 

అదేవిధంగా నూతనంగా ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం తాజాగా శుభవార్త తెలియజేసింది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సాయం అందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత ప్రభుత్వం నిధులను వినియోగించుకోలేదు. వాటిని రాబట్టి ఎక్కువ మందికి లబ్ది చేకూరుస్తాం. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తాం. ఈ పథకానికి బడ్జెట్లో 7740 కోట్లు కేటాయిస్తున్నాం’ అని ప్రకటించారు.

ALSO READ : BIG REAKING : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు..!