నల్గొండ జిల్లా కొప్పోలులో కేబుల్ దొంగల బీభత్సం..!
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని కొప్పోలు గ్రామంలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు.

నల్గొండ జిల్లా కొప్పోలులో కేబుల్ దొంగల బీభత్సం..!
12 వ్యవసాయ మోటర్ల వైర్లు చోరీ
గుర్రంపోడు, మన సాక్షి :
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని కొప్పోలు గ్రామంలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు రాత్రింబవళ్లు శ్రమిస్తుంటే, దుండగులు వారి పొలాల్లోని సుమారు 12 వ్యవసాయ మోటర్ల విద్యుత్ వైర్లను (కేబుళ్లను) కట్ చేసి ఎత్తుకెళ్లారు.బాధిత రైతుల వివరాల ప్రకారం…
Also Read : District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. లంచం డిమాండ్ చేసిన ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్..!
గ్రామానికి చెందిన రైతులు తిరుగుడు రామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డి, కృష్ణారెడ్డి, యాదగిరి రెడ్డి, వరదారెడ్డి, నిమ్మల శ్రీనివాస్ రెడ్డిలతో పాటు మరికొందరి బావుల వద్ద ఉన్న మోటర్ల కేబుళ్లను దొంగలు అపహరించారు. పంటలకు నీరు పారించాల్సిన కీలక సమయంలో ఈ దొంగతనం జరగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల విలువైన కేబుళ్లు పోవడంతో పాటు, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు.









