Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : రికార్డులలో లెక్కలు.. రోడ్డుపైన వృధాగా మొక్కలు..!

Nalgonda : రికార్డులలో లెక్కలు.. రోడ్డుపైన వృధాగా మొక్కలు..!

చింతపల్లి, మనసాక్షి:

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం” పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ” హరిత వనం అనే కార్యక్రమం ద్వారా గత రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ పథకం ( ఎన్ ఆర్ ఇ జి ఎస్ ) ద్వారా ఆయా గ్రామాలలోని నరసరీలలో లక్షలాది రూపాయలు వెచ్చించి మొక్కల పెంపకాన్ని చేపట్టింది.

ప్రభుత్వం అధికార పూర్వకంగా కొన్ని జిల్లాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయా జిల్లా అధికారులు మండల అధికారులు ఈ కార్యక్రమాన్ని జూలై మాసంలో చేపట్టారు. గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ హరితహారం మొక్కలు నాటేందుకు ఆయా మండలాల్లోని సంబంధిత సంబంధిత గ్రామాల్లో మొక్కలు నాటేందుకు మండల అధికారులకు ఉపాధి హామీ నిర్వాహకులకు ప్రభుత్వ యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని అప్పజెప్పింది.

ఈ నిర్వహణ కార్యాచరణ పై సంబంధిత జిల్లా అధికారుల, మండల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రహదారి వెంట నాటవలసిన మొక్కలు రికార్డులలో నమోదు అవుతున్నాయి కానీ, రోడ్ల పైన వృధాగా పడవేసి దర్శనమిస్తూ కార్యాచరణకు నోచుకోలేకపోతున్నాయి.ప్రభుత్వం ప్రతి గ్రామానికి కనీసం ఐదు నుండి పదివేల మొక్కలు మొక్కలు నాటాలని జిల్లా యంత్రాంగం సూచించినప్పటికీ ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక నీరు గారి పోతుంది తప్ప కార్యాచరణకు నోచుకోలేక పోతుంది.

అందులో భాగంగానే చింతపల్లి మండలంలో ని బోట్ మీ తండా గ్రామపంచాయతీ పరిధిలోగల నాగార్జునసాగర్ హైవే వెంట ఉపాధి హామీ పథకం ద్వారా నాటవలసిన మొక్కలు రోడ్డు పక్కన వృధాగా పడవేయడంతో మండల అధికారులపై ఉపాధి హామీ నిర్వాహకులపై పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని మొక్కలు నాటినట్లు రికార్డులలో నమోదు చేసుకున్నారు.

వృధాగా పడి వేసిన మొక్కల గూర్చి ఎవరు పట్టించుకోవడం లేదు. రోడ్డు వెంట నాటే ఎందుకు పెట్టిన మొక్కల గూర్చి గ్రామస్తులు పలుమార్లు సంబంధిత ఎన్ఆర్ఈజీ ఉపాధి హామీ ఏపీవో, ఎంపీడీవో, తనక గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని గ్రామస్తులు ఆ వేదన వ్యక్తపరుస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని రోడ్డు వెంట వృధాగా పడవేసిన మొక్కలు నాటించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు