దుబ్బాక : అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొని ఒకరు మృతి

దుబ్బాక : అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొని ఒకరు మృతి

దుబ్బాక, మనసాక్షి :
ప్రమాదవశాత్తు కారు చెట్టుకు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చిట్టాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. భూంపల్లి ఎస్సై గంగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

 

మెదక్ జిల్లా రామాయంపేట కు చెందిన దేవుని నర్సింలు, తన భార్య పుష్ప, వదిన జెల్ల లక్ష్మి ముగ్గురు కలిసి సిద్దిపేట మండలం బూరుగుపల్లి గ్రామంలో తన బంధువుల వివాహానికి హాజరై తిరిగి రామయంపేటకు టిఎస్ 15 ఈ ఎఫ్ 3590 నెంబర్ గల కారులో వెళ్తున్న క్రమంలో చిట్టాపూర్ గ్రామ శివారులో చెట్టుకు ఢీ కొన్నారు.

 

కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో పుష్ప (44) అక్కడికక్కడే మృతి చెందింది. నర్సింలు, లక్ష్మి లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని 108 వాహనంలో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.

 

నర్సింలు కుమారుడు రంజిత్ రాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.