Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతో సద్వినియోగమవుతాయి..!

గ్రామాలలో జరగబోయే నేరాలను ముందుగానే అరికట్టేందుకు ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలతో గ్రామాలలో నేరాలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే పసిగట్టి పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో సద్వినియోగం అవుతున్నాయని ఎస్సై ముత్యాల రామ్మూర్తి పేర్కొన్నారు.

నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతో సద్వినియోగమవుతాయి..!

చింతపల్లి, మన సాక్షి :

గ్రామాలలో జరగబోయే నేరాలను ముందుగానే అరికట్టేందుకు ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలతో గ్రామాలలో నేరాలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే పసిగట్టి పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో సద్వినియోగం అవుతున్నాయని ఎస్సై ముత్యాల రామ్మూర్తి పేర్కొన్నారు. రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ గ్రామంలో లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ దొంత గోని యాదమ్మ గ్రామంలోని పలు వీధులలో స్వతహాగా కొనుగోలు చేసిన సీసీ కెమెరాలను నేడు గ్రామంలో ఏర్పాటు చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి హాజరై గ్రామపంచాయతీ కార్యాలయంలో సీసీ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడు తూ నేటి సమాజంలో యువత చెడు మార్గంలో ప్రయాణిస్తూ గ్రామాల్లో హార్దిక నేరాలకు పాల్పడుతూ తమ జీవితాలను కోల్పోతున్నారని, అదేవిధంగా గ్రామాల్లో గుర్తుతెలియన్ వ్యక్తులు పర్యటిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని అలాంటి వారి నుండి గ్రామా ప్రజల కోసం రక్షణగా సర్పంచ్ దొంత గోని యాదమ్మ ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు.

అదేవిధంగా మండలంలోని మిగతా గ్రామ పంచాయతీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే మరిన్ని నేరాలను అరికట్ట వచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దొంత గోని యాదమ్మ, దొంత గోరి శేఖర్ గౌడ్, మాజీ ఎంపిటిసి మునుకుంట్ల శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ కొప్పుల జంగయ్య గౌడ్,గ్రామ పెద్దలు పంచాయతీ కార్యదర్శి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

  1. Miryalaguda : దివ్యాంగులకు ఎలక్ట్రికల్ వాహనాల పంపిణీ..!

  2. కోటి విలువైన 10 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత..!

  3. Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు