SANGAREDDY : ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు..!
SANGAREDDY : ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో జుమా మసీదు ఆదివారం రాత్రి జప్నే ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు… మొహమ్మద్ ప్రవక్త జన్మదిన మిలాద్ ఉన్ నబీ గా జరుపుకుంటారని ఇమామ్ నయ్యర్ అజం అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనంత కరుణామయుడైన అల్లాహ్ సర్వమానవాళి శ్రేయస్సు శాంతిని నెలకొల్పడం కోస్ం ఆఖరి ప్రవక్త మొహమ్మద్ను ఎన్నుకున్నట్లు అంతిమ (దైవ గ్రంధం) పవిత్ర ఖురాన్ లో చెప్పబడిందని పేర్కొన్నారు. మొహమ్మద్ ప్రవక్త చూపిన అడుగు జాడల్లో ప్రతి ముస్లిం సోదరులు నడవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షులు డాక్టర్ హమీద్,జలిల్ రుస్తుం, శంషుద్దీన్, టీచర్ చాంద్ సాబ్, రహీం టీచర్, అలీం సబ్, బాబు సాబ్, మహమూద్, భగవాన్ సమీర్, సయ్యద్, భగవాన్ పాషా, భగవాన్ రఫిక్ , మైనార్టీ సొదలు తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!
సెప్టెంబర్ 17న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనబోతుందా.. కలవర పడుతున్న మానవాళి..!
Nelakondapally : రైతులకు రూ.10వేల సహాయం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!









