లిక్కర్ స్కాం : సెల్ ఫోన్ల చుట్టూ రాజకీయం, సెల్ ఫోన్ లు మీడియాకు చూపిన కవిత
సెల్ ఫోన్ల చుట్టూ రాజకీయం, సెల్ ఫోన్ లు మీడియాకు చూపిన కవిత
న్యూఢిల్లీ :
మద్యం కుంభకోణంలో వరుసగా రెండవ రోజు ఈడి ఎదుట హాజరైన కవిత ఈడికి లేఖ రాశారు. తన సెల్ ఫోన్ లపై అనుమానం ఉన్నందున తన సెల్ ఫోన్ లు ఈడీకి అందజేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సెల్ ఫోన్ లను మీడియాకు చూపించారు.
ఫోన్లతో ఈడి విచారణకు వెళుతున్నట్టు మీడియాకు ఆమె చూపించారు. ఒక మహిళ ఫోన్లు వాడిన వాటిని కావాలని కోరడం మహిళా స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే అని ఆమె ఈడికి రాసిన లేఖలో పేర్కొన్నారు. నవంబర్ లో నే తాను ఫోన్లు పగలగొట్టినట్టు ప్రచారం చేశారని.. కానీ మార్చిలో తనకు నోటీసులు ఇచ్చారని ఆమె లేఖలో పేర్కొన్నారు.
10 ఫోన్లను ఈడి కి కవిత అందజేసిన వాటిలో ఆమె వాడిన ఫోన్ లేనా..? లేకుంటే వేరే ఫోన్లా ..? అనేవి ఈడి ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉంది . ఫోన్ల ఆధారంగా మద్యం కుంభకోణంలో ఈడి విచారణ వేగవంతం చేసే అవకాశం ఉంది.










