Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణవ్యవసాయం

Central scheme | ఈ పథకంలో చేరితే.. రైతులకు నెలకు రూ. 3 వేలు..!

Central scheme | ఈ పథకంలో చేరితే.. రైతులకు నెలకు రూ. 3 వేలు..!

మనసాక్షి , వెబ్ డెస్క్:

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం (PMKMY) వయసు పైబడిన సన్న, చిన్న కారు రైతులకు అండగా ఉంటుంది. ఈ పథకం సన్న చిన్న కారు రైతులకు సామాజిక బాధ్యతగా అమలు చేస్తుంది. 60 సంవత్సరాల వయసు నిండిన రైతులకు ఈ పథకం ద్వారా ప్రతినెల 3000 రూపాయల పింఛన్ అందజేస్తుంది.

 

అర్హులు :

18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులందరూ ఈ పథకంలో చేరవచ్చును. రైతులకు భూ రికార్డుల్లో పేర్లు ఉండాలి. సాగు చేసే భూమి రెండు హెక్టార్ల వరకు ఉండాలి. చిన్న సన్న కారు రైతులందరూ ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చును. కానీ 60 సంవత్సరాల వయసు నిండిన తర్వాతనే 3 వేల రూపాయల పింఛన్ అందుతుంది.

 

ఈ పథకానికి వీరు అర్హులు కాదు :

నేషనల్ పెన్షన్ స్కీం (NPS), ఈఎస్ఐ స్కీం, ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్న వారితో పాటు ఇతర సామాజిక భద్రత పథకాల పరిధిలో ఉన్నవారు అర్హులు కాదు. జాతీయ పెన్షన్ పథకాన్ని ఎంచుకున్న రైతులు… ప్రభుత్వ ఉద్యోగులు , ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వర్గాల వారు అనర్హులు.

ప్రీమియం చెల్లించాలి :

ఈ పథకంలో చేరిన రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు నిండే వరకు ప్రీమియం చెల్లిస్తే 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం 3000 రూపాయలు అందజేస్తుంది. రైతులు చెల్లించిన ప్రీమియం ఎంత అయితే ఉంటుందో ప్రభుత్వం కూడా తనవంతుగా బీమా కంపెనీకి అంతే చెల్లిస్తుంది.

 

18 సంవత్సరాల వారికి ప్రీమియం 55 రూపాయలు ఉంటుంది. ఏట వయసును బట్టి 3 నుంచి 10 రూపాయల వరకు పెరుగుతుంది. 40 సంవత్సరాల వారికి రూ. 200 ప్రీమియం ఉంటుంది.

 

ఒకవేళ రైతు చనిపోతే అతని భార్య ప్రీమియం కొనసాగించే అవకాశం ఉంటుంది. వయసు నిండిన తర్వాత రైతు మరణిస్తే అతని భార్యకు సగం పింఛన్ చెల్లిస్తారు. సుమారు 5 సంవత్సరాల పాటు రైతు తన ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

 

కామన్ సర్వీస్ సెంటర్లలో తమ పేర్లను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. రైతు ఫోటో , నివాస ధ్రువీకరణ పత్రం, ఆదాయం, వయసు నిర్ధారణ ,సాగుభూమి, ఆధార్ కార్డు తదితర పత్రాలను అందజేయాల్సి ఉంటుంది.

 

ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదవడానికి క్లిక్ చేయండి 👇

మరిన్ని వార్తలు