Miryalaguda : మిర్యాలగూడలో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్..!

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

Miryalaguda : మిర్యాలగూడలో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్..!

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. పెద్దవూర వై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలో ఈద సతీష్ (35), జింకల నాగరాజు (28) అనే ముఠా సభ్యులు పట్టుబడ్డారు.

వీరు గత కొంతకాలంగా జిల్లాలో ఒంటరిగా ఉన్న మహిళలను గమనించి చైన్ స్నాచింగ్ చేస్తూ ఉన్నారు. వీరు నుండి 4 తులాల 6 గ్రాముల బంగారం, హోండా బైక్, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని డిమాండ్ కు తరలించారు.

ALSO READ : Congress First List : కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. తెలంగాణలో అభ్యర్థులు వీరే..!