వీర వనిత చాకలి ఐలమ్మ – ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

వీర వనిత చాకలి ఐలమ్మ – ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ , సెప్టెంబర్ 10 , మనసాక్షి : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని చాటిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు.

శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి ని పురస్కరించుకొని సాగర్ రోడ్డు లోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాసాని అలివేలు-గిరి, పట్టణ రజక సంఘం అద్యక్షులు ఎర్రబెల్లి దుర్గయ్య, పట్టణ రజక సంఘం ప్రధాన కార్యదర్శి కుమ్మరికుంట్ల సుధాకర్, పట్టణ తెరాస అదికార ప్రతినిధి పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, బి.సి సంఘం నాయకులూ మారం శ్రీనివాస్, జాజుల లింగం గౌడ్, నల్లగంతుల నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.